: ట్రంప్ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిన ఒబామా!

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని వీడిన 10 రోజుల తర్వాత మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మళ్లీ ప్రజల ముందుకు వచ్చారు. రాజకీయ అంశంపై స్పందించారు. ఇస్లామిక్ దేశాల నుంచి వలసదారులను నిషేధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికైన నేతలకు వ్యతిరేకంగా తమ గళం వినిపించేందుకు ప్రజలంతా తమ రాజ్యంగ హక్కులను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. అమెరికా అత్యున్నత దేశమని... దాని విలువలు ప్రమాదంలో పడినప్పుడు, నిరసన తెలపడం ప్రజల కర్తవ్యం అని చెప్పారు.

ముస్లింలపై నిషేధం విధించే విషయంలో ఒబామా విధానాలనే తాను కూడా అనుసరిస్తున్నానని ట్రంప్ ఇంతకు ముందు చెప్పారు. 2011లో ఇరాక్ నుంచి వచ్చే శరణార్థులపై ఒబామా నిషేధం విధించారంటూ ట్రంప్ తెలిపారు. దీనికి కౌంటర్ గానే ఒబామా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 

More Telugu News