accident: హైదరాబాద్‌లో కారు బీభ‌త్సం.. 9 మందికి తీవ్ర‌గాయాలు.. ఇద్దరి ప‌రిస్థితి విష‌మం

హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ లో ఓ కారు అదుపుత‌ప్పి ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో 9 మందికి తీవ్ర‌ గాయాల‌య్యాయి. అనంత‌రం కారులోని వ్య‌క్తులు అక్క‌డి నుంచి పారిపోయారు. వెంట‌నే స్పందించిన స్థానికులు గాయాల‌పాల‌యిన వారిని ద‌గ్గ‌ర‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారికి చికిత్స అందిస్తున్నామ‌ని, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ ప్ర‌మాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్ కోసం గాలింపు చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు.

More Telugu News