: ఫ్రాన్స్ సుందరిని వరించిన 'విశ్వ'కిరీటం... ఆ అందాల భామ ఈమే!

2016 మిస్ యూనివర్స్ కిరీటం ఫ్రాన్స్ అందాల భామ ఇరిస్ మిథెనరీ సొంతమైంది. మనీలాలో జరిగిన తుది పోటీల్లో 23 ఏళ్ల డెంటల్ సర్జన్ విద్యార్థిని ఇరిస్ మిగతా వారిని పక్కకు నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఫస్ట్‌ రన్నరప్‌గా హైతీకి చెందిన రక్వెల్‌ పెలిసీర్‌ నిలువగా, మూడవ స్థానంలో కొలంబియాకు చెందిన ఆండ్రియా తోవర్‌ నిలిచింది. నోటి శుభ్రత, దంతాల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తనకు వచ్చిన గుర్తింపును వినియోగించుకుంటానని ఈ సందర్భంగా ఇరిస్ పేర్కొంది.

More Telugu News