: 11 రాష్ట్రాల ప్రత్యేక హోదాను తొలగిస్తున్నాం: పురందేశ్వరి

ఇండియాలో వివిధ కారణాల రీత్యా ప్రత్యేక హోదాను అనుభవిస్తున్న 11 రాష్ట్రాలకు హోదాను నిలిపివేయనున్నామని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా మోర్చా ఇన్ చార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆమె, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉండదని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాను మించిన లాభాన్నిచ్చే రాయితీలు, అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు.

More Telugu News