: ఉండాలా? వేరే పార్టీ చూసుకోవాలా?: టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ఫైర్

తెలుగుదేశం పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న తనవంటి వారిని పట్టించుకోవడం లేదని పార్టీలో ఉండాలా? లేక వేరే పార్టీ చూసుకోవాలా? అని మాజీ మంత్రి, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ శిల్పా మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలోనే శిల్పా నోటి వెంట ఘాటు వ్యాఖ్యలు రావడం గమనార్హం. నంద్యాల టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగగా, రోడ్ల విస్తరణ టాపిక్ వచ్చిన వేళ, పార్టీలో సమన్వయం కొరవడిందని, తనకు, మునిసిపల్ చైర్ పర్సన్ కు మాట మాత్రం చెప్పకుండా పనులు చేస్తున్నారని శిల్పా ఆరోపించారు. ప్రభుత్వ పనుల శంకుస్థాపనకు పిలవట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు  భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, బీవీ జయ నాగేశ్వరరెడ్డి, బీసీ జనార్దన్‌ రెడ్డి తదితరులు హాజరు కాలేదని తెలుస్తోంది.

తాను గతంలో ఇళ్ల పట్టాలు ఇస్తే, ఇప్పుడు వాటిని దొంగ పట్టాలంటున్నారని శిల్పా ఆరోపించారు. అన్నీ విన్న కేఈ సైతం కొంత అసహనానికి గురై, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంతో తనకేం సంబంధం లేదని, గతంలో నంద్యాలలో నెలకొన్న రాజకీయ సమస్యను పరిష్కరించాలని అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేసిన కేఈ, ఇటీవలి చంద్రబాబు కర్నూలు పర్యటన సందర్భంగా, మీ సమస్యను పరిష్కరించమని సూచించారని తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, భూమా వర్గం టీడీపీలో చేరిన తరువాత, నంద్యాల ప్రాంతంలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News