: సందట్లో సడేమియా... రూ. 60 లక్షల పెళ్లి నగలను లేపేసిన పిల్లాడు!

అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై బిజీగా ఉన్న వేళ, పట్టుమని పదేళ్లు కూడా ఉండని ఓ చోటా దొంగ పెళ్లి కోసం తెచ్చి పెట్టిన రూ. 60 లక్షల విలువైన నగల బ్యాగును ఏంచక్కా భుజానికి తగిలించుకుని చెక్కేశాడు. సీసీ కెమెరాలు తప్ప ఎవరూ అతడిని గమనించలేదు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. పెళ్లిలో ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో, ఇదే అదనుగా అక్కడి వచ్చాడో బచ్చా చోర్. సైలెంటుగా ఎంటరై భారీ మొత్తాన్ని దోచుకెళ్లాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పెళ్లి బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, ఆ దొంగతో పాటు మరికొందరు వివాహంలోకి వచ్చి ఉండవచ్చని, బంధువుల మాదిరిగా కలిసిపోయి దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. బ్యాగును తీసుకెళ్లిన బుడ్డోడికి తొమ్మిదేళ్ల వయసు ఉండవచ్చని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News