: నా నిర్ణయం చాలా చక్కగా ఫలితమిస్తోంది: ట్రంప్

ముస్లిం వలసవాదంపై తాను తీసుకున్న కఠిన నిర్ణయం చాలా చక్కగా ఫలితాలను అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను జారీ చేస్తూ, ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సిరియా, యెమన్ దేశాల నుంచి శరణార్థులు రాకుండా 120 రోజుల నిషేధాన్ని విధించిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేస్తూ, "ఈ నిర్ణయం చక్కటి ఫలితాన్ని ఇస్తోంది. మీరు అన్ని విమానాశ్రయాలతో పాటు దేశమంతా ఈ ప్రభావాన్ని చూడవచ్చు" అన్నారు. ఈ దేశాల నుంచి అమెరికన్ విమానాలు ఎక్కి ప్రయాణించాలనుకునే వారిని ఎయిర్ పోర్టుల్లోనే అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇకపై దేశంలోకి ఉగ్రవాదులను, వలసదారులను రాకుండా చూస్తామని చెప్పారు. మరింత కఠినంగా తన నిర్ణయాలు ఉండబోతున్నాయని, ఎన్నో ఏళ్లుగా దేశం అనుభవిస్తున్న బాధలను దూరం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News