: స్వయంగా నిప్పంటించిన పోలీసులను గుర్తించాం... కఠిన చర్యలేనన్న చెన్నై ఏసీపీ

జల్లికట్టు నిరసనకారులను మెరీనా బీచ్ నుంచి బయటకు పంపిన వేళ, చెన్నైలో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన అనంతరం, స్వయంగా వాహనాలకు నిప్పంటిస్తూ కనిపించిన పోలీసులను గుర్తించినట్టు చెన్నై అడిషనల్ పోలీస్ కమిషనర్ కే శంకర్ తెలిపారు. వారెవరన్న విషయాన్ని సోమవారం నాడు తెలుపుతామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. నిరసనల తరువాత, పలువురు పోలీసులు వాహనాలకు నిప్పు పెడుతున్న దృశ్యాలు వీడియోల రూపంలో బయటకు రాగా, కమల్ హాసన్, అరవింద్ స్వామి వంటి వాళ్లు, పోలీసుల చర్యలపై ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. పలువురు యువకులు తీసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపగా, పోలీసులు అన్నింటినీ సేకరించి పరిశీలించారు. కొన్నింటిలో పోలీసులు వాహనాలకు నిప్పంటించడం, మరికొన్నింటిలో ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేయడం వంటి దృశ్యాలున్నాయి. పోలీసులే విధ్వంసానికి దిగి, యువతను దోషిగా చూపే ప్రయత్నం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News