: డొనాల్డ్ ట్రంప్ మరో చారిత్రాత్మక నిర్ణయం... ప్రభుత్వ లాబీయింగ్ పై జీవితకాల నిషేధం

అధ్యక్ష పదవిలో కూర్చున్న తరువాత దూసుకెళుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రభుత్వ అధికారులు లాబీయింగ్ చేయడంపై జీవితకాల నిషేధాన్ని విధిస్తున్నామని ఆయన తెలిపారు. అధికారులు మరే ఇతర రకాల లాబీయింగ్ చేయడాన్ని ఐదేళ్లు నిషేధిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై అధికారులు ఎవరైనా దేశ ప్రజల కోసమే పని చేయాలని, వేరే దేశాల ప్రభుత్వాల కోసం పని చేయక్కర్లేదని, 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' అన్న తన నినాదానికి కట్టుబడి ఉండాలని ట్రంప్ సూచించారు.

ఎన్నికలకు ముందు తానిచ్చిన హామీలను ఒక్కొక్కటీ నెరవేరుస్తానని అన్నారు. వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మార్పులు చేస్తున్నట్టు కూడా ట్రంప్ వెల్లడించారు. కాగా, ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం చారిత్రాత్మకమని కొందరు అభివర్ణిస్తే, దీంతో ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల భర్తీ క్లిష్టతరమవుతుందని పలువురు విమర్శలు గుప్పించారు. అమెరికా మేలు కోసం కొన్ని రకాల నిర్ణయాలు విదేశీ ప్రభుత్వాలకు అనుగుణంగా తీసుకోక తప్పదని వారు తెలిపారు.

More Telugu News