: 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. 22.5 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు!: చంద్రబాబు

విశాఖపట్టణం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఐఐఏ సదస్సు అద్భుత విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సదస్సుకు ఊహించనంత అద్భుత స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. దీంతో లక్ష్యం కంటే మిన్నగా 10.54 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నామని ఆయన వెల్లడించారు. ఇవన్నీ అమలులోకి వస్తే 22.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన అంచనా వేశారు. వాటి వివరాల్లోకి వెళ్తే...

1) పరిశ్రమల రంగంలో 2.1 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 91 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. దీంతో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.  
2) ఇంధన రంగంలో 2.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 47 ఎంవోయూలు కుదుర్చుకున్నాము. వీటి ద్వారా 86 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే వెసులుబాటు ఉంది. 
3) ఎపీసీఆర్డీఏతో 1.24 లక్షల కోట్ల పెట్టుబడికి 62 ఎంవోయూలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలున్నాయి. 
4) మైనింగ్‌ రంగంలో 11,113 కోట్ల రూపాయల పెట్టుబడులతో 50 ఎంవోయూలు కుదిరాయి. వాటి ద్వారా సుమారు 17 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 
5) ఆహారశుద్ధి రంగంలో 6,055 కోట్ల రూపాయల పెట్టుబడులతో 177 ఎంవోయూలు కుదిరాయి. వాటితో 60 వేలమందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. 
6) పర్యాటక రంగంలో 7,237 కోట్ల రూపాయల పెట్టుబడితో 69 ఎంవోయూలు కుదిరాయి. వాటితో 50వేల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.  
7) ఐటీరంగంలో 4,813 కోట్ల రూపాయల పెట్టుబడులతో 67 ఎంవోయూలు కుదిరాయి. వాటి ద్వారా సుమారు 47 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. 
8) రోడ్లు భవనాల శాఖలో 74 వేల కోట్ల పెట్టుబడులతో ఎంవోయూలు కుదిరాయి.
9) టౌన్‌ షిప్‌ వసతుల కల్పనకు 40 వేల కోట్ల పెట్టుబడులతో 14 అవగాహన ఒప్పందాలు కుదరగా, వాటితో 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. 
10) ఏపీఈడీసీ ద్వారా 3,62,662 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో 66 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
11) నైపుణ్యాభివృద్ధిలో 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 3 ఎంవోయూలు కుదిరాయి.
12) జౌళిరంగంలో 521 కోట్ల రూపాయల పెట్టుబడులతో 8 ఎంవోయూలు కుదరగా, వాటి ద్వారా 18,550 మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. 
13) ఉన్నత విద్యారంగంలో 16,706 కోట్ల రూపాయలతో 9 ఎంవోయూలు కుదిరాయి. వాటితో 1.52 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అంటూ ఆయన తెలిపారు. 

More Telugu News