deepika: బ‌న్సాలీపై దాడి చేయడంతో షాక్‌లోకి వెళ్లిపోయా: దీపికా పదుకొణె

రాజస్థాన్‌లోని జయపురలో జయ్‌గఢ్‌ కోట వద్ద చారిత్రక సినిమా ‘పద్మావతి’ చిత్రీకరణ జరుగుతుండగా దర్శకుడు సంజయ్‌ లీల బన్సాలీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాణి పద్మావతిగా దీపికా పదుకొణె, అల్లావుద్దీన్‌ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు. అయితే, ఒక్క‌సారిగా ఈ దాడి జ‌ర‌గ‌డంతో దీపిక పదుకొనె షాక్‌కు గురైందట. నిన్న త‌మ సినిమా షూటింగ్ సెట్‌లో బ‌న్సాలీపై ప‌లువురు దాడి చేశార‌ని తెలుసుకొని కొన్ని నిమిషాల పాటు తాను షాక్‌లోకి వెళ్లిపోయినట్టు ఆమె తెలిపింది. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తున్నారంటూ సెట్‌లోకి వ‌చ్చి వారు చేసిన ఈ దాడి ప‌ట్ల బాలీవుడ్ ప్ర‌ముఖులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

More Telugu News