sharukh khan: షారుఖ్ 'రాయిస్‌' సినిమాకి భారీ కలెక్షన్లు

బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధానపాత్రలలో రాహుల్‌ దోలాఖియా దర్శకత్వంలో వ‌చ్చిన‌ 'రాయిస్‌' సినిమా మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. దేశీయంగా రూ. 46.72 కోట్లను రాబ‌ట్టింది. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లైన విష‌యం తెలిసిందే. దేశీయంగా తొలిరోజు రూ. 20.42 కోట్లు, రెండో రోజు రూ. 26.30 కోట్లను వసూలు చేసి, ఓవర్సీస్‌లో మరో 9 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టింది. ఈ రోజు, రేపు కూడా వసూళ్లు ఇలాగే రాబ‌డితే ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యే అవకాశముంది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మ‌రిన్ని క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తుంద‌ని బాలీవుడ్‌ ట్రెడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

More Telugu News