special status: రండి.. కదలి రండి.. ఆర్కే బీచ్ లో ‘ప్రత్యేక హోదా’ పోరుకి పిలుపునిచ్చిన చ‌ల‌సాని

ఈ నెల 26న త‌ల‌పెట్టిన ప్ర‌త్యేక హోదా పోరాటం విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత చ‌ల‌సాని శ్రీ‌నివాస్ మ‌రోసారి ఆ పోరాటానికి పిలుపునిచ్చారు. వ‌చ్చేనెల 9, 10, 11, 12 తేదీల్లో ప్ర‌త్యేక హోదా కోసం పెద్ద ఎత్తున దీక్ష చేయాల‌ని తాము నిర్ణ‌యించుకున్న‌ట్లు ఈ రోజు ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ తెలిపారు. శాంతియుతంగా నిర్వ‌హించ‌నున్న ఈ దీక్ష‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌కుంటే ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు. ఈ పోరుకి విద్యార్థులు, యువ‌త, సినీ ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాలని అన్నారు.

విశాఖ‌ప‌ట్నంలోని ఆర్కే బీచ్‌లో దీక్షకు కూర్చుంటామ‌ని, శాంతియుతంగా చేయాల‌నుకుంటున్న ఈ దీక్ష‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌జా, ఉపాధ్యాయ‌, కార్మిక సంఘాల‌తో తాము చర్చించామ‌ని వారు కూడా పోరులో పాల్గొంటార‌ని తెలిపారు. ఈ పోరాటానికి అందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. 

More Telugu News