amitab: షారుక్‌ సినిమా అమితాబ్ కు తెగ నచ్చేసిందట!

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన ‘రయీస్‌’ చిత్రం రెండు రోజుల క్రితం విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమాని బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా చూశారు. అనంత‌రం ఆ సినిమాపై త‌న స్పంద‌న తెలుపుతూ... షారుక్ న‌ట‌నను ప్ర‌శంసించారు. ఆ సినిమా మొత్తంలో షారుక్‌ కోపంగా ఉన్నప్పుడు పండించిన హావభావాలు త‌న‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపారు.


More Telugu News