: పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయితే, ఏపీకి అడ్డుండదు: అరుణ్ జైట్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంయుక్తంగా తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, అభివృద్ధి పథంలో ఏపీకి తిరుగుండదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విశాఖపట్నంలో సీఐఐ ఇంటర్నేషనల్ సదస్సు ప్రారంభం కాగా, సదస్సును ప్రారంభించిన అనంతరం జైట్లీ ప్రసంగించారు. అత్యంత పొడవైన సముద్ర తీరం ఉండటం ఏపీ అదృష్టమని జైట్లీ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఏపీ దూసుకెళుతుందని అంచనా వేశారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించినా, ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అందుకు వృద్ధిరేటు గణాంకాలే నిదర్శనమని, గతంలో రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేరుస్తున్నామని, మిగిలిన హామీలను కూడా ఒక్కొక్కటిగా తీరుస్తామని తెలిపారు. భవిష్యత్తులో సైతం దేశ ప్రగతి కంటే, రాష్ట్ర ప్రగతి గణాంకాలు మెరుగ్గా ఉంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

More Telugu News