samantha: ‘నా లవ్‌స్టోరీ పేజీ నుంచి.. మీకు ప్రేమతో’ అంటూ ట్వీట్ చేసిన స‌మంత

చెన్న‌య్ బ్యూటీ సమంత, సినీ హీరో అక్కినేని నాగచైతన్యకు ఈ నెల 29న వివాహ నిశ్చితార్థం జరగనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎంతో సంబ‌ర‌ప‌డిపోతున్న స‌మంత తాను చైతుతో క‌లిసి న‌టించిన‌ ‘ఏ మాయ చేసావె’ చిత్రంలోని ఓ స్టిల్‌ను చెక్కుతూ ఉన్న ప్ర‌త్యేక‌ వీడియోను సోషల్ మీడియాా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ‘నా లవ్‌స్టోరీ పేజీ నుంచి.. మీకు ప్రేమతో’ అని అందులో పేర్కొంది. స‌మంత పోస్ట్ చేసిన‌ ఈ వీడియోకు ఆమె అభిమానుల నుంచి భారీగా స్పంద‌న వ‌స్తోంది. అమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News