: యువత ఉద్యమాన్ని వాయిదా వేశారంతే, ఇక ఆపలేరు: పవన్ అల్టిమేటం

నిన్న శాంతియుత పోరాటం చేస్తామని చెప్పిన యువతకు అనుమతులు ఇచ్చి వుండాల్సిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. యువత ప్రదర్శనలు ఏ రాజకీయ పార్టీ పిలుపో కాదని, వాళ్లంతట వాళ్లు నిర్ణయించుకున్నదేనని చెప్పారు. "రిపబ్లిక్ దినోత్సవం కాబట్టి అందరూ ఒకచోటకు వస్తారు. ఓ కలెక్టివ్ వాయిస్ ను వినిపించవచ్చని ఈ పని చేశారు. కనీసం మీరు వాళ్లకు నడిచేందుకు ఓ గంట పర్మిషన్ ఇచ్చుండాల్సింది. దీని వల్ల మీరు కేవలం నిరసనను వాయిదా మాత్రమే వేయగలిగారు. ఇకపై దీన్ని మీరు ఆపలేరు. కాకపోతే నా విన్నపం ఏంటంటే, మీ అనుభవాన్ని, పెద్దరికాన్ని గౌరవిస్తాను. కానీ, మీ అనుభవం ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపకరించని పక్షంలో నేను ఎందుకు ప్రజల పక్షాన రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలుపకూడదో ఒక్కసారి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేయండి" అని పవన్ కోరారు.

చంద్రబాబు నుంచి ఇప్పటికీ తాను పూర్తి పారదర్శకమైన పాలననే కోరుకుంటున్నానని, అదే జరగకుంటే ఎంత దూరమైనా ఉద్యమ మార్గంలో ప్రయాణిస్తానని పవన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని నమ్మకంతో, ప్రేమతో గెలిపించారని, కానీ భయపెట్టి పాలిస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. భయపెట్టి పాలించాలంటే కుదరదని, ప్రజా సమస్యలను, ఉద్యమాన్ని పోలీసులతో కంట్రోల్ చేయాలంటే సాధ్యపడదని, పోలీసులతో ఒక్క కాశ్మీర్ రాష్ట్రాన్నే నియంత్రించలేకున్నామని, ఆ పరిస్థితిని ఏపీలోనూ తేవద్దని హితవు పలికారు.

More Telugu News