: చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకాలు పోతున్నాయ్... ఆయన పరిపాలనానుభవం ఏమైంది?: పవన్

"ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నేను మద్దతివ్వడానికి కారణం ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ పీరియన్స్. పరిపాలనా అనుభవం. 2014 ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడే చెప్పాను. వారి పరిపాలనా అనుభవం రాష్ట్రానికి కావాలని. ఇప్పుడాయన ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించక పోవడం ఆయన నైతికంగా చేస్తున్న తప్పు. దాన్ని సరిదిద్దుకోవాలి" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

మాటిచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. స్పెషల్ స్టేటస్ కాకుండా ప్యాకేజీతో ఏం వస్తుందని తాను ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. నోట్ల రద్దుకు చంద్రబాబు మద్దతు పలికారని గుర్తు చేస్తూ, ఆపై ఇబ్బందులు ఉన్నాయని, నోట్ల రద్దుతో నష్టమేనని చెబుతూ ఐదు సార్లు మాటలు మార్చారని చెప్పారు. ఇంత అనుభవమున్న మీరే ఇన్నిసార్లు మాటలు మారుస్తుంటే, ప్రత్యేక హోదాపైనా మీరు మాట మార్చారని ఎందుకు అనుకోకూడదో స్పష్టంగా చెప్పాలని అడిగారు.

More Telugu News