: 'నోట్ ఫర్ ఓట్'లో చిక్కుకున్నప్పుడు ఒక్క మాటైనా అడిగానా, చంద్రబాబూ?: పవన్ సూటి ప్రశ్న

గతంలో చంద్రబాబునాయుడు 'నోట్ ఫర్ ఓట్' కుంభకోణంలో చిక్కుకున్న వేళ, తననుంచి ఒక్క మాట కూడా రాలేదన్న విమర్శలకు పవన్ సమాధానం ఇచ్చారు. ఆనాడు తాను మాట్లాడకపోవడానికి కారణాన్ని వివరిస్తూ, "అది ఒక్క తెలుగుదేశం పార్టీ చేసుండుంటే, అంతకుముందు అలా ఎవరూ చేయకుండా ఉండుంటే, నేను కచ్చితంగా, బలంగా నిలదీసి వుండేవాడిని. అన్ని పార్టీలూ హార్స్ రైడింగ్ చేస్తాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాన్ని నేను వెనకేసుకు రావడమనుకోండి, ఇంకేమైనా అనుకోండి... నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి దానికీ గొడవలు పెట్టుకుంటే... ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రాలు మనవి. ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే, ప్రజలకు నష్టం కలుగుతుందే తప్ప, పనులు ముందుకు సాగవని చూసీ చూడనట్టు మాట్లాడాను. అది తెలిసో తెలీకో కాదు... తెలిసే" అని పవన్ చెప్పారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను ఇన్నాళ్లూ ప్రభుత్వాలపై విమర్శలకు దిగలేదని అన్నారు. వాళ్లు చేస్తున్నది తన ఉద్దేశంలో సరైనదేనని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

More Telugu News