: అమెరికాకు రావద్దని ట్రంప్ వార్నింగ్... రానుపొమ్మని సమాధానం ఇచ్చిన మెక్సికో అధ్యక్షుడు

యూఎస్, మెక్సికోల నడుమ నిర్మించ తలపెట్టిన దుర్భేద్యమైన గోడ నిర్మాణానికి అయ్యే ఖర్చులో ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నిటో స్పష్టం చేసిన వేళ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. గోడకయ్యే ఖర్చును పంచుకునేందుకు అంగీకరించకుంటే, ఈ నెలాఖరులో తలపెట్టిన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్యా వాతావరణం వేడెక్కగా, తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ఎన్రిక్ స్పష్టం చేశారు. కాగా, యూఎస్, మెక్సికోల నడుమ 3,100 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉండగా, ఇందులో 1600 కిలోమీటర్ల మేరకు గోడ నిర్మించాలని, కొంత భాగాన కంచె, మరికొన్ని చోట్ల సిమెంటు శ్లాబులను అమర్చాలని ట్రంప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News