special status: వీరి మాటలు వింటుంటే వీరంతా నాయకులేనా? అనిపిస్తోంది!: జ‌గ‌న్

ప్ర‌త్యేక‌ తెలంగాణను ప్రజలు పోరాడి సాధించుకున్నార‌ని, త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మాన్ని న‌డిపి ఆర్డినెన్స్ సాధించార‌ని, ఆ ఉద్య‌మాలే స్ఫూర్తిగా మ‌నం ప్ర‌త్యేక హోదా కోసం ముందుకు క‌దులుదామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు  విశాఖ‌ప‌ట్నం నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... త‌మిళ‌నాడులో జల్లికట్టు పోరాటానికి, ప్రత్యేక హోదాకు పోలికేంటని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నార‌ని, ఎవ‌రు అడ్డుప‌డినా పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌దామ‌ని పేర్కొన్నారు.
 
చంద్ర‌బాబు లాంటి వ్య‌క్తి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్నందుకు రాష్ట్రం న‌ష్ట‌పోతోంద‌ని జ‌గ‌న్ అన్నారు. ‘ఎన్నిక‌ల ముందు జాబు రావాలంటే బాబు రావాలి అన్నారు. ఇప్పుడు చెబుతున్నాను.. జాబు రావాలంటే చంద్ర‌బాబు ప‌ద‌వి నుంచి దిగిపోవాలి. చంద్రబాబు, సుజనా చౌద‌రి లాంటి వారి మాటలు వింటుంటే నిజంగా వీరంతా నాయ‌కులేనా? అనిపిస్తుంది. ప్ర‌త్యేక హోదాపై నాయ‌కులంతా ఆనాడు ఒక‌లా మాట‌లు మాట్లాడారు, ఇప్పుడు ఒక‌లా మాట్లాడుతున్నారు. ఎన్నిక‌ల మానిఫెస్టోలో పెట్టిన మాట‌లేమిటి? ఇప్పుడు చెబుతున్న మాట‌లేమిటి? ఇన్ని అవాస్త‌వాలు, ఇన్ని మోసాలు చేస్తున్నారు. నిజంగా వీళ్లు నాయ‌కులేనా? అనిపిస్తోంది. వీరు మంత్రులా? అనిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల శ్వాస.. అది సాధించుకుందాం’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

More Telugu News