: స్లెడ్జింగ్ కు సమాధానం చెబుతామంటున్న వివాదరహిత క్రికెటర్

టీమిండియాలో వివాదరహితుడిగా, మిస్టర్ కూల్ గా పేరుతెచ్చుకున్న నయా మిస్టర్ డిపెండబుల్ ఛటేశ్వర్ పుజారా ఆస్ట్రేలియా తో పోటీకి సన్నద్ధమైనట్టు తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టుతో ఆట అంటే స్లెడ్జింగ్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందేనని, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పాడు. అయితే ఈ సిరీస్ భారత్ లో జరుగుతుంది కనుక స్లెడ్జింగ్ ఎక్కువగా ఉంటుందని భావించడం లేదని పుజారా తెలిపాడు.

ఈ సిరీస్ ప్రపంచంలోనే టెస్టుల్లో టాప్ 2 జట్ల మధ్య జరుగుతుందని చెప్పాడు. తాను కేవలం మూడో స్థానానికే పరిమితం కానని అన్నాడు. జట్టుకు పరుగులు సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు. పాజిటివ్ గా ఆడితే ఆసీస్ బౌలర్లు కొత్తగా ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారని, ఆ సమయంలో పరుగులు సాధించే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. లోయర్ ఆర్డర్ గతంలోలా రాణించి, బౌలర్లు సహకరిస్తే టీమిండియాదే విజయమని పుజారా స్పష్టం చేశాడు. 

More Telugu News