: ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సీఎన్ఎన్ తీసిన ఫోటో సూపర్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రింఫ్ (విజయోత్సవం) సందర్భంగా సీఎన్ఎన్ వార్తా సంస్థ తీసిన ఫోటో ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. వాషింగ్టన్ లోని క్యాపిటల్ భవనంపై నుంచి.. 'డొనాల్డ్ జె ట్రంప్ అనే నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా విశ్వసనీయతతో విధులు నిర్వర్తిస్తానని, దేశ సంరక్షణకు శాయశక్తులా కృషిచేస్తానని, సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను' అంటూ చేసిన ప్రమాణ స్వీకారం సందర్భంగా సీఎన్ఎన్ ఛానెల్ క్యాపిటల్ భవనంతోపాటు సుదూరంలో ఉన్న ట్రంప్ అభిమానులందర్నీ కవర్ చేస్తూ 360 డిగ్రీల కోణంలో గిగాపిక్సల్ టెక్నాలజీతో ఓ ఫోటో తీసింది. ఈ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో మరో ప్రత్యేకత ఏంటంటే, దీనిని జూమ్ చేస్తున్న కొద్దీ ఆనాటి సభలోని ప్రతి ఒక్కరి ముఖం అతి స్పష్టంగా కనిపించడం. ఈ ఫోటోకు విశేషమైన ప్రశంసలు, షేర్లు, లైకులు వస్తున్నాయి.
http://edition.cnn.com/interactive/2017/01/politics/trump-inauguration-gigapixel

More Telugu News