special status: తొక్కుతామంటే లేచి మరీ పోరాడ‌తాం: హోదాపై చలసాని శ్రీనివాస్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా కావాల‌ని రాష్ట్ర యువ‌త రేపటి నుంచి పోరాటానికి సిద్ధ‌మైన వేళ ఆ అంశంపై ప్రత్యేకహోదా సాధ‌న స‌మితి అధ్య‌క్షుడు చ‌ల‌సాని శ్రీ‌నివాస్ స్పందించారు. రేపు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి తీరుతామ‌ని చెప్పారు. హోదా పోరాటాన్ని తొక్కుతామంటే లేచి మరీ పోరాడ‌తామ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేక ప్యాకేజీ రాష్ట్రానికి వ‌ద్దని, ఎన్నో ప్ర‌యోజ‌నాల‌కు తెచ్చిపెట్టే హోదానే కావాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోస‌మే త‌మ‌ పోరాటమ‌ని తెలిపారు. నిర‌స‌న‌లు తెలిపేవారిని అరెస్టు చేస్తామంటే బెద‌ర‌బోమని ఉద్ఘాటించారు.

More Telugu News