: చట్టసవరణ చేసి ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమేమీ కాదు: జయప్రకాష్ నారాయణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ రాష్ట్ర‌ యువత చేయ‌నున్న‌ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్ర‌త్యేక‌ హోదా విభజన చట్టంలో లేదని కేంద్రం చెబుతోందని పేర్కొన్న ఆయ‌న‌... ఈ విష‌యాన్నే హోదా ఇవ్వడానికి ప్ర‌ధాన అడ్డంకిగా చూపుతోందని అన్నారు. ఈ అంశం అసలు సమస్యే కాదని, ప్రధాని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీకి చట్టబద్ధత ఉంటుందని తెలిపారు.

అది కుదరని పక్షంలో కాంగ్రెస్‌తో పాటు 16 పార్టీల మద్దతు ఉన్నందున భార‌తీయ జ‌న‌తా పార్టీ హోదా ఇవ్వాల‌నుకుంటే ఇప్పుడు విభజన చట్టానికి సవరణ చేయడం కష్టమేమీ కాదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని ఉద్ఘాటించారు. హోదాకు సమానమైన ప్యాకేజీని ఏపీకి ఇచ్చామని చెప్పుకుంటోన్న కేంద్ర ప్ర‌భుత్వ వ్యాఖ్య‌ల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. హోదాతో 100 శాతం ఐటీ పన్ను మినహాయింపు, కార్పొరేట్ పన్ను మినహాయింపు, ఎక్సైజ్ సుంకం వంటి ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని అన్నారు.

More Telugu News