: కేసీఆర్ పై విరుచుకుపడిన మావోయిస్టులు... ప్రజలు ఉద్యమించాలని లేఖ

అరచేతిలో బంగారు తెలంగాణను చూపుతున్న కేసీఆర్, కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాస్తున్నారని మావోయిస్టు కమిటీ తీవ్ర విమర్శలు చేసింది. పేదల నుంచి బలవంతంగా భూములను తీసుకుని వాటిని కంపెనీలకు ధారాదత్తం చేసేందుకే 2016 భూ సేకరణ చట్టాన్ని కేసీఆర్ తీసుకు వచ్చారని ఆరోపిస్తూ, పేదలకు భూమి లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మీడియాకు ఓ లేఖను పంపుతూ, అభివృద్ధి పేరిట కార్పొరేట్ కంపెనీలకు ఎర్రతివాచీని పరుస్తున్నారని ఆరోపించింది. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, వారిపై ప్రజలు తిరగబడాలని కోరింది. కొత్త భూసేకరణ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని మావోయిస్టు కమిటీ డిమాండ్ చేసింది.

More Telugu News