: ఏమండీ చంద్రబాబు... ఎందుకు ర్యాలీలు జరపకూడదు... యువతకు అండగా నిలిచి తీరుతా: జగన్

ప్రత్యేక హోదా కోసం యువత జిల్లా కేంద్రాల్లో, రాష్ట్రంలోని నగరాల్లో క్యాండిల్ ర్యాలీ ప్రదర్శనలు చేసుకుంటే తప్పేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ఆ ప్రయత్నం చేయడం లేదని ఆరోపిస్తూ, నిరసన ప్రదర్శనలను అడ్డుకుంటామని చెప్పడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. "విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో ర్యాలీలు జరపకూడదట. మిగిలిన చోట్ల కూడా జరపకుండా చర్యలు తీసుకుంటారట. ఏమండీ... ఎందుకు జరపకూడదు? నువ్వు పోరాటం చేయాల్సింది నువ్వు చెయ్యకపోగా, ప్రజలంతా ముందుకు వచ్చి, ప్రత్యేక హోదా కావాలని అడుగుతూవుంటే, అది కూడా ఓర్చుకోలేవా? ఆశ్చర్యం. ఎక్కడైనా 144 సెక్షన్ ఎప్పుడు పెడతారు? ఏదైనా జరిగితే పెడతారు. కానీ ఏమీ జరగలా... జరగకమునుపే ఈ సెక్షన్లున్నాయి కాబట్టి వీడియో తీసి మీ అంతు చూస్తాము అని బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని డీజీపీ ఇలా చెబుతుంటే... ఇది ధర్మమేనా? అని నేను గట్టిగా అడుగుతున్నాను. యువత చేసే పోరాటానికి వైకాపా అండగా నిలుస్తుంది" అని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రత్యేక హోదా అవసరం లేదన్న తప్పుడు సంకేతాలను పంపేలా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని అన్నారు. 

More Telugu News