special status: జల్లికట్టుకి, హోదాకి లింకు ఏమిటా.. ఇదిగో!: చ‌ంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాపై ఈ రోజు ఉద‌యం నుంచి ఒక ట్వీటు వెనుక మ‌రో ట్వీటు చేస్తున్నారు. ఈ రోజు ఏపీకి ప్ర‌త్యేక హోదాను కోరుకుంటోందంటూ కేంద్రంలో ఉండే నాయ‌కుల‌కి, పార్టీల‌కి ఆంధ్రులు బానిస‌లు కాదంటూ ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సందించిన విష‌యం తెలిసిందే.

తాజాగా ప‌వ‌న్‌ మ‌రో ట్వీటు చేస్తూ ప్ర‌త్యేక‌ హోదా అంశం విష‌యంలో చంద్ర‌బాబు నాయుడిని ప‌రోక్షంగా విమ‌ర్శించారు. మొన్న దావోస్ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదాపై ఉద్యమం జ‌ర‌గ‌నుంద‌న్న సంకేతాలు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఆ అంశంపై స్పందిస్తూ ప్ర‌త్యేక హోదాకు, త‌మిళ‌నాడులో జ‌రిగే జ‌ల్లిక‌ట్టు ఉద్యమానికి పోలిక ఏమిటి? అంటూ ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతున్నాన‌న్న‌ట్లుగా ప‌వ‌న్ ఈ ట్వీటు చేయ‌డం గ‌మ‌నార్హం.

‘జల్లికట్టుకి, హోదాకి లింకు ఏమిటి? అన్న ప్రశ్నకు- ఒక సంప్రదాయం కోసం తమిళులు అంత పోరాటం చేస్తున్నప్పుడు, మన అవసరాల కోసం ఇంకెంత పోరాటం చెయ్యాలి?’ అని పవన్ తన ట్వీటులో పేర్కొన్నారు.


More Telugu News