special status: ఏపీకి ప్రత్యేక హోదా కోసం మేము సైతం పోరాడతాం: టీఆర్ఎస్ ఎంపీ కవిత

త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు చేసిన జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మంతో స్ఫూర్తి పొందిన ఆంధ్ర యువ‌త ప్ర‌త్యేక హోదా కోసం పోరాడతామ‌ని ప్ర‌క‌టించిన అనంత‌రం ‘హోదాపై పోరాటం’ అంశం మ‌రోసారి ఉవ్వెత్తున ఎగసిప‌డుతోన్న వేళ దీనిపై టీఆర్ఎస్ నాయ‌కురాలు, నిజామాబాద్ ఎంపీ క‌విత స్పందించారు. తెలుగు రాష్ట్రాల స‌మస్య‌ల‌పై తెలుగువారమంతా క‌లిసి పోరాడ‌దామ‌ని ఆమె పిలుపునిచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాపై పోరాటానికి తాము మ‌ద్ద‌తు తెలుపుతున్నామ‌ని అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్ర‌భుత్వం నెర‌వేర్చాల్సిన హామీలు ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌త్యేక హోదా కోసం ఏపీ ఎంపీల‌తో క‌లిసి పోరాడ‌డానికి తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు కోసం ఏపీ ఎంపీలు కూడా త‌మ‌తో క‌లిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

More Telugu News