: పావురాల‌ మేత అమ్ముతున్నాడని రూ.25 వేలు జ‌రిమానా విధించిన కోర్టు.. అయినా మానేది లేదంటున్న 'పావురాల మ‌నిషి'!

పావురాల‌కు మేత అమ్మి డ‌బ్బులు సంపాదించే బ్రిట‌న్‌కు చెందిన పావురాల మ‌నిషి పౌల్ చార్ల్‌ట‌న్‌కు కోర్టు 300 పౌండ్ల(రూ.25,500) జ‌రిమానా విధించింది. పావురాల వ‌ల్ల జ‌నాలు అసౌక‌ర్యానికి గుర‌వుతున్నార‌ని, త‌న దుకాణంలోకి అవి చొర‌బ‌డి కేకులు పాడుచేస్తున్నాయంటూ ఓ దుకాణ‌దారు చేసిన ఫిర్యాదుకు  స్పందించిన కోర్టు చార్ల్‌ట‌న్‌కు జ‌రిమానా విధించింది. అయితే త‌న‌ను జైల్లో పెట్టినా పావురాల‌కు మేత అమ్మ‌డం మానేది లేద‌ని, అది త‌న బ‌తుకుదెరువు అని చెబుతున్నాడు. పొట్ట‌కూటికోసం తాను చేస్తున్న పని ఇత‌రుల‌కు నచ్చ‌క‌పోవ‌చ్చ‌ని పేర్కొన్న ఆయ‌న కోర్టుకు చిల్లిగ‌వ్వ కూడా చెల్లించేది లేద‌ని తేల్చి చెప్పాడు.

చార్ల్‌ట‌న్ పావురాల‌కు మేత అమ్మ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదిస్తున్నాడు. వీధుల్లో నిల‌బడి మేత విక్ర‌యించే అత‌డిపై పావురాలు గుంపులుగా వ‌చ్చి వాలుతాయి.  అత‌డి వ‌ద్ద మేత కొనుకున్న‌వారు దానిని పావురాలకు వేస్తుంటారు. త‌న దుకాణం ముందు చార్ల్‌ట‌న్ నిల‌బ‌డి పావురాల మేత అమ్మ‌డం వ‌ల‌న, అవి త‌న షాపులోకి వ‌చ్చి కేకుల‌ను పాడుచేస్తున్నాయంటూ ఓ షాపు య‌జ‌మాని కేసు వేశాడు. కేసును విచారించిన కోర్టు చార్ల్‌ట‌న్‌కు 300 పౌండ్ల జ‌రిమానా విధించింది.

More Telugu News