: వీళ్లంతా ఓట్లేసిన మొహాలేనా?: నిరసన చేస్తున్న మహిళలపై నోరు పారేసుకున్న ట్రంప్

తనను వ్యతిరేకిస్తూ, అమెరికాలోని వివిధ నగరాల్లో రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకున్నారు. దాదాపు 50 లక్షల మంది మహిళలు నిరసనలు చేస్తుండగా, వీరెవరూ అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేసిన వారు కాదని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. "నిన్నటి నిరసనలు చూశాను. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. వీరంతా ఎందుకు ఓట్లు వేయలేదు? ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు ఓ భాగమేనని అన్ని సమయాల్లో నేను అంగీకరించను. అయితే, తమ మనోభావాలను వెల్లడించే హక్కు ప్రజలకు ఉంది" అన్నారు.

ఓట్లు వేయని వాళ్లే ఇప్పుడు నిరసనలకు దిగుతున్నారని ఆరోపించారు. కాగా, మహిళల్లో, మైనారిటీ వర్గాల్లో ట్రంప్ వైఖరి పట్ల ఆందోళన నెలకొందని నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంఘాలు ఆరోపిస్తున్నాయి. మెక్సికో నుంచి వచ్చిన వలసవాదులు, దేశంలో స్థిరపడ్డ ముస్లింలు ఎంతో ఆందోళనగా ఉన్నారని నిరసనకారులు వెల్లడించారు. కాగా, ఈ నిరసనల్లో సెలబ్రిటీలు, నటులు పలువురు పాలు పంచుకోవడం గమనార్హం. పాప్ స్టార్ మడోనా, హీరోయిన్లు చార్జెజ్ థెరాన్, డ్ర్యూ బారీ మోర్, లీనా దున్హామ్ తదితరులు మహిళల నిరసనల్లో పాల్గొన్నారు.

More Telugu News