: 'కేసీఆర్, కేటీఆర్ లతో మాట్లాడతా... తెలంగాణలో నాకు పవర్ లేదనుకుంటున్నావా? ఆళ్లగడ్డ రాగలవా?' అంటూ కాంట్రాక్టరును బెదిరించిన ఆడియోపై స్పందించిన భూమా

"నేను భూమా నాగిరెడ్డిని మాట్లాడుతున్నా... (అవతలి నుంచి చెప్పండి అని వినిపించింది) చెప్పండి అంటే ఏంటి? (అవతలి నుంచి 'చెప్పండన్నా... రాంపుల్లారెడ్డి వాళ్లు తీసుకున్నారని చెప్పాను' అని వినిపించింది) అవును...  వాళ్లు తీసుకుంటారు. నేను వర్క్ జరగనీయకపోతే? నువ్వేమైనా తిక్కగా మాట్లాడుతున్నావా? వాడు ఆడ వర్క్ చేసుకుంటున్నాడు. ఆడ వర్కే జరగనీయను. నువ్వేం చేస్తావు? రేపు కేసీఆర్, కేటీఆర్ తో మాట్లాడతాను. ('మాట్లాడండి అయితే' అని అవతలి వైపు నుంచి..) తెలంగాణలో నాకు పవర్ లేదనుకుంటున్నావా? ('ఫర్లేదు వుంటే మాట్లాడండి తప్పేముంది' అని వినిపించింది) నువ్వు రావా ఇక్కడికి? ఆళ్లగడ్డకు రావా?" అంటూ భూమా నాగిరెడ్డి ఓ కాంట్రాక్టరును ఫోన్ లో బెదిరిస్తున్న ఆడియోను ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూ సందర్భంగా వినిపించగా, ఆ గొంతు తనదేనని భూమా అంగీకరించారు.

"ఆ ఫోన్ సంభాషణలో ఏమీ మ్యాటర్ లేదు. అది మా అపోజిషన్ క్యాండిడేట్ నుంచి వచ్చిన ఫోన్ అని మాకు అర్థమైంది. సో దానికి తగ్గట్టు మేం మాట్లాడాము" అని స్పష్టం చేశారు భూమా. అసలీ ఆడియో ఫేక్ అని తాను నిరూపించగలనని, వేరే వేరే సందర్భాల మాటలు కలిపారని ఆరోపించారు. ఇంత సంచలనం సృష్టించే సంభాషణ ఆన్ లైన్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఆడియో మధ్యలో కొన్ని పదాలు కలిపారని ఆరోపించారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ విచారణలో తేలిందని అన్నారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఆ కాంట్రాక్టరుతో మాట్లాడారని తెలిపారు. భూమా నాగిరెడ్డి పేరు వినిపిస్తేనే సంచలనం చేస్తున్నారని అన్నారు. 

More Telugu News