: యువత కదిలితే వెనక నిలుస్తా: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రాష్ట్ర యువత ఏ కార్యక్రమం చేపట్టినా తాను మద్దతిస్తానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 26న విశాఖపట్నం ఆర్కే బీచ్ లో యువత మౌన నిరసన దీక్ష చేపడితే, జనసేన దానికి మద్దతిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు గత రాత్రి ట్వీట్లు చేశారు. అవకాశవాద, నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓ ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్ ను జనసేన విడుదల చేయనుందని తెలిపారు. 'దేశ్ బచావో' పేరిట ఈ ఆల్బమ్ ఉంటుందని, దీన్ని జనవరి 24న విడుదల చేస్తామని తెలిపారు. వాస్తవానికి ఈ ఆల్బమ్ ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలని భావించినప్పటికీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించామని పవన్ తెలిపారు.

More Telugu News