sp balu: తెలుగువాళ్లు ఐక్యత, అంకితభావం లేనివాళ్లు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

ప్ర‌సిద్ధ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ఈ రోజు విజయవాడలో రోటరీ క్లబ్ జీవ‌న సాఫల్య పురస్కారం ప్ర‌దానం చేసింది. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారిపై, తెలుగుసినిమాల‌పై ఎన్న‌డూ లేని విధంగా వ్యాఖ్యలు చేశారు. తెలుగువాళ్లు ఐక్యత, అంకితభావం లేనివాళ్లని ఆయ‌న అన్నారు. తమ అభిమాన‌ హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేసే అభిమానులు, త‌మ హీరోల‌ను జాతీయ అవార్డు అందుకునే స్థాయిలో సినిమాలు చేయమ‌ని ఎందుకు అడ‌గ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. టాప్ హీరోలంతా కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. హీరోలు త‌మ జీవితంలో కనీసం ఒక్క సినిమా అయినా త‌మ‌ జాతి, భాష కోసం చేయాలని ఆయ‌న సూచించారు.

క‌థానాయకులు సంవ‌త్స‌రానికి నాలుగు సినిమాలు తీస్తే వాటిలో ఒక్కటైనా జాతీయ అవార్డు వచ్చేలా తీయాల‌ని బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వ్యాఖ్యానించారు. చిన్న సినిమాలకు థియేట‌ర్లు దొర‌క‌ని తీరుపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మిథునం లాంటి సినిమాకు థియేటర్లే దొరకలేదని, పెద్ద సినిమాలు వస్తే నిర్దాక్షిణ్యంగా అటువంటి సినిమాలను సినిమాహాళ్ల‌ నుంచి తీసేస్తున్నారని, అయితే చిత్రాల స్థాయిని నిర్ణయించేది ప్రేక్షకులేనని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News