trump: భారీ భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది.. ట్రంప్ తొలి సంత‌కంపై నెటిజ‌న్ల భ‌యం.. భయం

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రిప‌బ్లిక‌న్ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌పై నెటిజ‌న్లు జోకులు పేల్చుతూ దానితో పాటు భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ ఓ అధికారిక డాక్యుమెంట్‌పై తొలి సంతకాన్ని చేశారు. ఆ సంత‌కాన్ని ప‌రిశీలించిన నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ... ఆయ‌న సంత‌కం భూకంప‌ ఫ్రీక్వెన్సీ సింబల్‌ను పోలి ఉంద‌ని అంటున్నారు. ఇది అత్యంత శక్తిమంతమైన సంతకం అని, భారీ భూకంపం వస్తే సిస్మోగ్రాఫ్‌లో నమోదయ్యే విధంగా అది ఉందంటూ ప‌లువురు పోస్టులు చేస్తే... ట్రంప్‌ చేసిన సంతకం ఆటోగ్రాఫ్‌లా ఉందని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఆయన సంతకం కోపం, భయాలను సూచిస్తోందని చేతిరాత నిపుణులు ఓ ఇంటర్వూలో చెప్పారు. అంతేగాక‌, ఆయ‌న సంత‌కంపై నెటిజ‌న్లు ప‌లుర‌కాల విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

More Telugu News