rail accident: హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్ర‌మాదంపై ఘాటుగా స్పందించిన మమతా బెనర్జీ

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన  హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. మ‌రో 100 మందికి పైగా తీవ్ర‌ గాయాల‌య్యాయ‌ని, వారికి చికిత్స అందిస్తున్నామ‌ని అధికారులు ప్ర‌క‌టించారు. కాగా, ఈ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆమె... మృతులకు సంతాపం తెలుపుతూ ఓ ప్రకటనను విడుద‌ల చేస్తూ అందులో తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ ఘ‌ట‌న‌కు రైల్వే శాఖ నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని ఆమె ఆరోపించారు. రైలు ప్రయాణికుల భద్రతకు తక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని అన్నారు. రైళ్ల‌లో రోజుకు కోట్లాది మంది ప్రజలు ప్రయాణిస్తుంటార‌ని, రైల్వే వ్యవస్థ దేశానికి జీవన రేఖ అని ఆమె అన్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు కృషిని తాము నిందించడం లేదని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న ఆమె... ఇలాంటి అత్యవసర సమయాల్లో కేంద్ర స‌ర్కారు వెంట‌నే స్పందించాల‌ని అన్నారు.

More Telugu News