accident: హైద‌రాబాద్‌ పాత‌బ‌స్తీలో ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఆటో.. సీసీ కెమెరాలో రికార్డ‌ు

హైద‌రాబాద్‌ నగరంలోని పాత‌బ‌స్తీలో ఓ ఆటో పాద‌చారుడి ప్రాణం తీసింది. ప్రయాణికుల‌తో రోడ్డుపై వెళుతున్న ఓ ఆటో ముందు చ‌క్రం ఒక్క‌సారిగా ఊడిపోయి గాలిలోకి లేచింది. అది అలాగే ఎగిరి వ‌చ్చి రోడ్డు దాటుతున్న ఓ వ్య‌క్తిపై ప‌డింది. డానికి తోడు ఆ వ్య‌క్తిని ఆటో కొన్ని అడుగుల దూరం ఊడ్చుకెళ్లింది. ఈ దృశ్యాల‌న్నీ అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మృతి చెందిన వ్య‌క్తి ఓ బియ్యం దుకాణంలో ప‌నిచేస్తున్న జంగ‌య్య‌గా గుర్తించారు. అత‌డు ప‌హాడీ ష‌రీఫ్ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి అని చెప్పారు.

More Telugu News