: క్లీన్ స్వీప్ పై కన్నేసిన ఇండియా, పరువు నిలుపుకోవాలన్న తపనతో ఇంగ్లండ్!

ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా, ఆఖరిదైన నేటి మ్యాచ్ లోనూ గెలిచి పర్యటనకు వచ్చిన జట్టుపై క్లీన్ స్వీప్ సాధించాలన్న కసితో కోహ్లీ సేన సమాయత్తమవుతుండగా, కనీసం ఈ మ్యాచ్ లో గెలిచి భారత ఆధిక్యాన్ని 2-1కి పరిమితం చేసి పరువు నిలుపుకోవాలన్న ఆలోచనలో ఇంగ్లండ్ సిద్ధమవుతోంది. నేడు కోల్ కతాలో మధ్యాహ్నం 1:30 నుంచి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగనుంది.

రెండో మ్యాచ్ లో యువరాజ్ అద్భుత 150 రన్స్ తో, ధోనీ సెంచరీతో ఫామ్ లోకి రావడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక ఈ సిరీస్ లో భాగంగా రిజర్వ్ బెంచ్ కి మాత్రమే పరిమితమైన ఆటగాళ్లలో ఒకరిద్దరికి ఈ మ్యాచ్ లో చాన్సిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈడెన్ లోని పిచ్ పై పరుగుల వరద ఖాయమని క్యూరేటర్ అభిప్రాయపడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఎంతటి స్కోరు చేసినా, దాన్ని అందుకునే అవకాశాన్ని పిచ్ కల్పిస్తుందని తెలిపారు.

More Telugu News