: చెన్నై నుంచి న్యూఢిల్లీ వరకూ... అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చి మహిళల నిరసన

ఆసేతు హిమాచలం మహిళాలోకం కదిలింది. నూతన సంవత్సర వేడుకల వేళ, బెంగళూరు వీధుల్లో అమ్మాయిలపై జరిగిన దారుణ వేధింపుల ఘటనను వ్యతిరేకిస్తూ, మహిళలకు రక్షణ కల్పించాలన్న డిమాండ్ తో అన్ని నగరాలు, పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. 'ఆక్యుపయ్యింగ్ ది నైట్ స్ట్రీట్స్' పేరిట న్యూఢిల్లీ నుంచి చెన్నై వరకూ, ముంబై నుంచి కోల్ కతా వరకూ 30 నగరాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు గత రాత్రి వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు.

విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు వీరిలో అధికంగా ఉన్నారు. మహిళలకు సమాన హక్కులు, భద్రత కోరుతూ పాటలు పాడి డ్యాన్సులు చేస్తూ నిరసనలు తెలిపారు. తమకు స్వాతంత్ర్యం కావాలని, వేధింపులు ఆపాలని నినాదాలు చేశారు. పగలైనా, రాత్రయినా తమకు భద్రత లేకుండా పోయిందని, ఈ పరిస్థితి మారాలని నినదించారు. "నేను 12 ఏళ్ల వయసు నుంచి బయట తిరగాలంటే భయపడుతూనే ఉన్నాను. అమ్మాయిలు వేసుకున్న దుస్తుల గురించి అడుగుతారే తప్ప, వేధిస్తున్న మృగాళ్ల గురించి మాట్లాడరెందుకు? నాకిప్పుడు మూడేళ్ల పాప ఉంది. తనకూ ఇదే పరిస్థితి రాకూడదనే నేనిప్పుడు వీధిలోకి వచ్చాను" అని ఓ ఈ-కామర్స్ సంస్థలో ప్రోగ్రామ్ మేనేజర్ గా పని చేస్తున్న అనురాధా సిన్హా వ్యాఖ్యానించారు.

More Telugu News