: కాంగ్రెస్ పోస్టర్లలో తన చిత్రాల ముద్రణపై తీవ్రంగా స్పందించిన ప్రణబ్ ముఖర్జీ!

ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ వేయించుకున్న హోర్డింగులు, పోస్టర్లపై తన చిత్రాలు ఉండటంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ఎలక్షన్ కమిషన్ కు లేఖను పంపించారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా సాగాలని, వెంటనే ఆ హోర్డింగులు తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ జైదీకి ప్రణబ్ కార్యదర్శి ఒమితా పాల్ నుంచి లేఖ వచ్చింది. ఈ హోర్డింగుల విషయంలో లూథియానా డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ఏ పార్టీకి చెందినవారు కాదని, అన్ని రాజకీయ పార్టీలూ ఆయనకు ఒకటేనని, తమ లక్ష్యాల సాధనకు ఆయన్ను వినియోగించుకోవడం తగదని ఒమితా పాల్ ఒక ప్రకటనలో కోరారు.

More Telugu News