: ఏపీకి ప్రత్యేకహోదాపై మహేష్ బాబు ట్వీట్లు చేయాలి: చలసాని

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధనకు తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలపాలని ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. ప్రకాశం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, తమిళనాడు ప్రజలు చేసిన జల్లికట్టు ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలుగు సినీ హీరోలు ఏపీకి ప్రత్యేకహోదాకు ఎందుకు మద్దతుగా మాట్లాడరని ప్రశ్నించారు. తమిళనాడు ప్రజలను చూసి ఎంతో నేర్చుకోవాలని ఆయన సూచించారు. జల్లికట్టుకు మద్దతుగా హీరో మహేష్ బాబు ట్వీట్లు చేశారని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం కూడా మహేష్ బాబు ట్వీట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ తో పాటు ఇతర సినీ, రాజకీయ నాయకులు ప్రత్యేకహోదా కోసం ప్రత్యక్షంగా పోరాడాలని ఆయన సూచించారు. 

More Telugu News