: నిరసన సమయంలో స్పృహ కోల్పోయిన లారెన్స్ రాఘవ!

ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్  లారెన్స్ రాఘవ తమిళ యువత హృదయాలలో పెద్దన్నగా నిలిచిపోయాడు. జల్లికట్టు కోసం చిత్తశుద్ధితో సంఘీభావం తెలిపిన ఏకైక సినీ ప్రముఖుడు లారెన్స్ మాత్రమే అని వారు అంటున్నారు. మెరీనా బీచ్ కు వెళ్లి జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న వారితో జతకలిశాడు లారెన్స్. అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ తన గళం వినిపించాడు. ఈ క్రమంలో అతను పూర్తిగా అలసిపోయాడు. నిన్న ఉదయం విద్యార్థులతో పాటు కూర్చున్న లారెన్స్ 11.30 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం స్పృహ కోల్పోయాడు. వెంటనే అక్కడున్న యువత ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికి లారెన్స్ కోలుకున్నాడు.

జల్లికట్టు కోసం పోరాడుతున్న వారికి ఆహారపానీయాలకు కోటి రూపాయలైనా ఖర్చు చేస్తానని లారెన్స్ ప్రకటించడం... తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు, పోరాటంలో పాల్గొన్న మహిళల అవసరాల కోసం టాయ్ లెట్ సదుపాయం ఉన్న ఐదు కేరవాన్ లను మెరీనా తీరంలో ఏర్పాటు చేశాడు. లారెన్స్ చేసిన సహాయం అక్కడి యువతకు ఆయనను పెద్దన్నను చేసింది.  

More Telugu News