: ఇక‌ ఇంట్లోనే ఆ పరీక్ష చేసుకోవచ్చు.. అభివృద్ధి చేసిన అమెరికా కంపెనీ!

ఆస్ప‌త్రికి వెళ్లి వీర్య ప‌రీక్ష చేయించుకునేందుకు ఇబ్బంది ప‌డే వారి కోసం స‌రికొత్త ప‌రిక‌రం వ‌చ్చేస్తోంది. ఇంట్లోనే తేలిక‌గా వీర్య ప‌రీక్ష చేసుకునేందుకు వీలుగా అభివృద్ధి చేసిన ఓ ప‌రిక‌రం త్వ‌ర‌లోనే మార్కెట్లోకి రానుంది. స్మార్ట్‌ఫోన్‌, యాప్ ద్వారా ప‌నిచేసే ఈ ప‌రిక‌రాన్ని అమెరికాకు చెందిన ఓ కంపెనీ రూపొందించింది. 'యో స్పెర్మ్' పేరుతో పిలిచే ఈ ప‌రిక‌రం వీర్య కణాల క‌ద‌లిక‌ల‌ను పసిగ‌ట్టి విశ్లేషిస్తుంది. 97 శాతం క‌చ్చిత‌త్వంతో ప‌నిచేసే ఇది ఆస్ప‌త్రికి వెళ్లి వీర్య ప‌రీక్ష చేయించుకునేందుకు ఇబ్బంది ప‌డేవారికి చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుందని దానిని అభివృద్ధి చేసిన కంపెనీ  పేర్కొంది.

More Telugu News