: ట్రంప్ ముంద‌రి కాళ్ల‌కు బంధం.. నూత‌న అధ్య‌క్షుడి చేతికి కొత్త ఫోన్‌.. ఇక కొంద‌రికే ప‌రిమితం!

అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ముంద‌రి కాళ్ల‌కు అప్పుడే బంధం ప‌డింది. అధ్య‌క్షుడిగా ఆయ‌న ఇక కొంద‌రికే ప‌రిమితం కానున్నారు. సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్‌లో చురుగ్గా ఉండే ఆయ‌న ఇక దానికి దూరం కానున్నారు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఉప‌యోగించిన ఆండ్రాయిడ్‌ఫోన్ స్థానంలో అత్యంత దుర్భేద్య‌మైన ఫోన్ వ‌చ్చి చేరింది. అమెరికా భ‌ద్ర‌తా విభాగం ఈ సీక్రెట్ ఫోన్‌ను అధ్య‌క్షుడికి అందించింది. ఈ ఫోన్ నంబ‌రు అతి కొద్దిమందికి మాత్ర‌మే తెలుస్తుంది. ఇన్నాళ్లు నేరుగా అంద‌రికీ అందుబాటులో  ఉంటూ అరుదైన రాజ‌కీయవేత్త‌గా పేరుగాంచిన ట్రంప్ ఇక నుంచి కొంద‌రికే ప‌రిమితం కానున్నారు. ఈ ప‌రిస్థితి ట్రంప్‌కు కొంచెం ఇబ్బందిక‌ర‌మే.

మొబైల్ ఫోన్‌ను ఉప‌యోగించిన తొలి అధ్య‌క్షుడిగా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా గుర్తింపు పొందారు. మొద‌ట్లో ఆయ‌న అత్యంత ప‌టిష్ట‌మైన బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను వాడేవారు. త‌ర్వాత హ్యాక‌ర్లు కూడా చొర‌బ‌డ‌లేని కొత్త ఫోన్‌ను భ‌ద్ర‌తా విభాగం ఆయ‌న చేతికి అందించింది. కాగా ఫోన్ మారినా త‌న ట్విట్టర్ అకౌంట్‌ను మాత్రం మార్చ‌న‌ని ట్రంప్ చెప్పిన‌ట్టు స‌మాచారం.

More Telugu News