: నాలుగు రోజుల ఆందోళనతో కేంద్రం మెడలు వంచిన తమిళులు... ఐకమత్యానికి మారుపేరు!

జల్లికట్టుపై గత మూడేళ్లుగా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఈ గ్రామీణ సంప్రదాయ క్రీడను నిషేధించింది. దీంతో తమిళనాడు యువకులు పోరాటం ప్రారంభించారు. తమ సంస్కృతీ సంప్రదాయాలను అణచివేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. దీనిపై తమిళనాడు యువకులు పోరాటం ప్రారంభించారు. దీంతో పలువురు సినీ నటులు స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ కాకుండా ఒక్కచోట పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని సూచించారు. అంతే, సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభించగానే యువకులు కార్యోన్ముఖులయ్యారు. మరుసటి రోజే 'చైన్నై మెరీనా బీచ్ లో ఆందోళన' కార్యక్రమం అంటూ ప్రకటించారు. దీంతో నాలుగు రోజుల క్రితం చెన్నైలోని మెరీనా బీచ్ జనసంద్రమైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువకులు గ్రూపులు గ్రూపులుగా వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. వారికి పలు రాజకీయపార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రం వద్దకు వెళ్తున్నట్టు ప్రకటించింది. దీంతో కోలీవుడ్ కదిలింది. ఆందోళనతో పాటు నిరాహారదీక్షకు కూడా సిద్ధమని తెలిపారు. ఆ దెబ్బతో వివాదం రాజుకుంది. దీంతో ఆగమేఘాల మీద కదిలిన ప్రభుత్వం ఎంపీలు, కీలక నేతలతో హస్తినకు బయల్దేరింది. కేంద్రంతో దఫదఫాలుగా మంతనాలు జరిపింది. ఇంతలో దేశవ్యాప్తంగా ఉన్న తమిళులు తమతమ ప్రాంతాల్లో ఆందోళన ప్రారంభించారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయని కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. రేపు సాయంత్రం రాష్ట్రపతి సంతకంతో జల్లికట్టుపై ఆర్డినెన్స్ వెలువడనుంది. 

More Telugu News