: చర్చి కోర్టులు ఇచ్చే విడాకులు చెల్లవు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

క్రిస్టియన్ పర్సనల్ లా బోర్డు ప్రకారం చర్చి కోర్టులు ఇచ్చే విడాకులు చెల్లవని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. చర్చి కోర్టు ఇచ్చే విడాకులకు చట్టబద్ధత లేదని.... అలాంటి విడాకులు చెల్లవని తేల్చి చెప్పింది. ఇది భారతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. చర్చి కోర్టులు ఇచ్చే విడాకులకు చట్టబద్ధత కల్పించాలంటూ కర్ణాటక కేథలిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పైస్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ల ధర్మాసనం... పిటిషన్ ను కొట్టివేసింది. 1996లోనే చర్చి కోర్టులు మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత లేదనే విషయాన్ని స్పష్టం చేశామని ధర్మాసనం తెలిపింది.

More Telugu News