: జల్లికట్టు ఉద్యమంలో భాగంగా రేపు తమిళనాడు బంద్

జల్లికట్టు ఉద్యమంతో తమిళనాడు అట్టుడుకుతోంది. ఉద్యమాన్ని విద్యార్థులు నడిపిస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో చెన్నైలోని మెరీనా బీచ్ ఆందోళనకారులతో జనసంద్రమైంది. ఈ నేపథ్యంలో రేపు తమిళనాడు బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. గత రెండు రోజులుగా తమిళనాట కళాశాలలు స్వచ్ఛందంగా తెరుచుకోవడం లేదు. విద్యార్థులు పిలుపునివ్వడంతో వారికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రేపు నిరాహార దీక్షకు కూర్చోనుండగా, ప్రఖ్యాత ఛెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ జల్లికట్టు ఆందోళనకు మద్దతు పలికాడు. కొంత మంది విద్యార్థులు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

More Telugu News