: వారి వివరాలు ఆదాయ పన్ను శాఖకు చేరనున్నాయి!

బ్యాంకుల్లో ఒక ఏడాదిలో రూ.10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ నగదు జమ చేసిన , రూ.లక్ష క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించిన వారి ఖాతాల వివరాలు ఆదాయపన్ను శాఖకు చేరనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ వేదికగా జరిగిన లావాదేవీలతో పాటు పైన పేర్కొన్న వివరాలను తమకు తెలియజేయాల్సిందిగా బ్యాంకులను ఆదాయ పన్ను శాఖ కోరింది. కాగా, పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీగా నగదు జమ అయిన సంగతి తెలిసిందే.

More Telugu News