: అర్ధ సెంచరీతో యువీకి అండగా నిలబడ్డ ధోనీ

టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన  తరువాత ధోనీ తొలిసారి నిలకడ ప్రదర్శించాడు. ఓపెనర్లతో పాటు కెప్టెన్ విఫలమైన వేళ ధాటిగా ఆడుతున్న యువరాజ్ సింగ్ కు ధోనీ అండగా నిలిచాడు. ఈ క్రమంలో యువీ 55 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా, ధోనీ 68 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి, సత్తాచాటాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో స్లిప్ లో ఫోర్ సాధించడం ద్వారా 50 పరుగులకు చేరుకున్నాడు. వీరిద్దరూ రాణించడంతో టీమిండియా 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్రీజులో యువరాజ్ సింగ్ (82), దోనీ (58) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ మూడు వికెట్లు తీసి రాణించాడు. 

More Telugu News