jallikattu: ఇది తమిళుల నిరసన కాదు.. విప్ల‌వం!: జ‌ల్లిక‌ట్టుపై హీరో విశాల్

త‌మ సంప్ర‌దాయ క్రీడ‌యిన జ‌ల్లిక‌ట్టును నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ త‌మిళ‌నాడు వ్యాప్తంగా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున నిరస‌న‌లు వ్య‌క్తం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై ఈ రోజు హీరో విశాల్ మాట్లాడుతూ తాను కూడా వారి పోరాటానికి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ అంశంపై చొర‌వ తీసుకోవాలని ఆయ‌న కోరారు. కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే ఆర్డినెన్స్‌ను తీసుకువ‌చ్చి, జ‌ల్లిక‌ట్టుకు అనుమ‌తి ఇవ్వాలని అన్నారు. ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను ప్ర‌భుత్వం గౌర‌వించాలని పేర్కొన్నారు. జ‌ల్లిక‌ట్టుపై ప్ర‌జ‌లు చేస్తోంది నిరసన కాదని, ఇదో విప్ల‌వమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News